Dec 25, 2010

బాల ఏసు

గాత్రం: సుశీల
సాహిత్యం: అమ్మిరాజు



రాజా దేవా నీవినవా మా గాధ
బాల ఏసు రా

పల్లవి:

దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా
దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా
మానవలోకం మంగళజ్యోతి మా మదిలో వెలిగించవా
దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా

చరణం1:

లోక పిత ... లోక పిత
కరుణ సుధ ... కరుణ సుధ
మృదు మధుర సుధా రసం చిందించవా
లోక పిత ... లోక పిత
కరుణ సుధ ... కరుణ సుధ
మృదు మధుర సుధా రసం చిందించవా
నవ వసంత కాలమునే చూపవా
మా జీవన పూదోటలొ వికసించవా
నా వాంఛలేవో ఈడేరు కాదా బాల ఏసు చూపించవా

దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా
దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా

చరణం2:

వేదనతో ... వేదనతో
కుమిలితిమీ ... కుమిలితిమీ
మాకు ఒక బాలుని నీవీయవా
ముద్దు మాటలేనాడూ విందుమే
మీ అమ్మకు నీవొక బిడ్డవు కావా
మరియమ్మ పుత్రా నా గోడు వినవా
మదిలో వాంఛ నెరవేర్చవా

దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా
మానవలోకం మంగళజ్యోతి మా మదిలో వెలిగించవా
దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా
దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: