గాత్రం: పి.బి.శ్రీనివాస్, సుశీల
సాహిత్యం: ఆత్రేయ
పల్లవి:
అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే
నువ్వంటే నువ్వే నీవంటిది నువ్వే నువ్వే
అందమంటే నువ్వే
చరణం1:
నువ్వుగాక వేరెవరైనా నవ్వలేరు వెన్నెలలాగా
నువ్వులేక వెన్నెలలైనా నవ్వలేవు పున్నమివేళ
అహహ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నువ్వుగాక వేరెవరైనా నవ్వలేరు వెన్నెలలాగా
నువ్వులేక వెన్నెలలైనా నవ్వలేవు పున్నమివేళ
నవ్వలేవు పున్నమివేళ
అందమంటే నువ్వే
చరణం2:
కొలనువంటి కన్నులలోన తళుకులీను చూపులచేపలు
వలపు వలను వేసానంటే ఎగిరి మనసులో పడతాయి
ఆహహహహా ఓహొహొహొ ఆహహహ
కొలనువంటి కన్నులలోన తళుకులీను చూపులచేపలు
వలపు వలను వేసానంటే ఎగిరి మనసులో పడతాయి
ఎగిరి మనసులో పడతాయి
అందమంటే నువ్వే
చరణం3:
నీలాగే నింగికి ఎగసి నాలానే నీడను పరచి
మనలాగే జగతికి సొగసు మాపుల్లో మరుగైపోదా
అహహ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీలాగే నింగికి ఎగసి నాలానే నీడను పరచి
మనలాగే జగతికి సొగసు మాపుల్లో మరుగైపోదా
మాపుల్లో మరుగైపోదా
అందమంటే నువ్వే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment