Feb 9, 2011

అన్నదమ్ముల అనుబంధం

తారాగణం: రామారావు,మురళిమోహన్,బాలకృష్ణ,కాంచన,లత
గాత్రం: సుశీల & కోరస్
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
సంగీతం: చక్రవర్తి
దర్శకత్వం: ఎస్.డి.లాల్
నిర్మాత: సీతాంబరం
సంస్థ: శ్రీగజలక్ష్మి చిత్ర
విడుదల: 1975



పల్లవి:

లాలాల లాలాల లాలాల లాలా లలాల లలాల
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైన పలికేను ఏనాటికైనా
ఉం మీరు పాడండి బాబు
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే

చరణం1:

ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీనిలయమై నిలవాలి
ఏటేటా లలలలలా మన ఇంట లలలలలా ఈ పండగే జరగాలి లలలలలా
ఈ నిలయం లలలలలా కలకాలం లలలలలా శ్రీనిలయమై నిలవాలి లలలలలా
వెలుతురైనా చీకటైనా విడిపోదు ఈ అనుబంధం
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే

చరణం2:

తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి
తారకలే లలలలలా దిగివచ్చి లలలలలా తారంగం ఆడాలి లలలలలా
వెన్నెలలే లలలలలా ముంగిటిలో లలలలలా వేణువులై పాడాలి లలలలలా
ఆటలాగ పాటలాగ సాగాలి మన జీవితం

ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైన పలికేను ఏనాటికైనా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment