Jun 3, 2011

ఆత్మబంధువు

తారాగణం: శివాజి గణేషణ్, రాధ
గాత్రం: బాలు,జానకి
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: ఇళయరాజా
దర్శకత్వం: భారతీరాజా
విడుదల: 1985



పల్లవి:

మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం

చరణం1:

ఒక చిలక ఒద్దికైంది మరు చిలక మచ్చికైంది
వయసేమో మరిచింది మనసొకటై కలిసింది
కట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగులాగేనా
ప్రేమలేని నాడీనేల పూవులిన్ని పూచేనా
మనిషిలేని నాడు దేవుడైనా లేడు
మంచిని కాచే వాడు దేవుడికి తోడు

మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం

చరణం2:

వయసు వయసు కలుసుకుంటే పూరి గుడిసే రాచనగరు
ఇచ్చుకోను పుచ్చుకోను ముద్దులుంటే పొద్దుచాలదు
ప్రేమ నీకు కావాలంటే పిరికివాడు కారాదు
గువ్వ గూడు కట్టే చోట కుంపటెత్తి పోరాదు
ఓర్వలేని సంఘం ఒప్పుకోదు నేస్తం
జాతి మత భేదాలన్నీ స్వార్థపరుల మోసం

మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment