Jul 1, 2011

ఒకరికి ఒకరు

గాత్రం: కీరవాణి
సాహిత్యం: సీతారామశాస్త్రి




పల్లవి:

వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా
అయినా ఎందుకే ఇలా తడబాటు అంతలా
తెగ హుషారుగ ఎగిరిపోకె తగని ఊహ వెంట
సరైన దారి తెలియందే ఈ ఉరుకులెందుకంట
వెళ్ళిపోతే ఎలా
వెళ్ళిపోతే ఎలా

చరణం1:

ఆమె వలలో చిక్కుకున్న సమయం
ప్రేమ లయలో దూకుతోందా హృదయం
నేను ఇపుడు ఎక్కడ ఉన్నానంటే
నాక్కూడా అంతు చిక్కుకుంటె
గమ్మతుగానె ఉన్నదంటే
నాకేదో మత్తు కమ్మినట్టె
రమ్మంది కాని నన్ను చేరి మెరుపు సైగ చెసి
చెప్పింది నింగి చెలి దారి చినుకు వంతెనేసి
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా

చరణం2:

తాను కూడా రాకపోతే నాతో
నేను కూడా ఆగిపోనా తనతో
నా ప్రాణం ఉంది తన వెంటే
నా ఊపిరుంది తననంటే
కళ్ళార చూసానంటువుంటే
ఎల్లా నమ్మేది స్వప్నమంటే
వెనక్కి వెళ్ళి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని
మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: