Aug 29, 2011

రాము

గాత్రం: పి.సుశీల
సాహిత్యం: దాశరధి



పల్లవి:

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే

చరణం1:

నన్నే నీవు అమ్మ అన్న నాడు
మీ నాన్న మనసు గంతులువేసి ఆడు
నన్నే నీవు అమ్మ అన్న నాడు
మీ నాన్న మనసు గంతులువేసి ఆడు
మంచికాలం మరలా రాగా ముళ్ళబాటే పూలతోట
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే

చరణం2:

గూటిలోని పావురాలు మూడు
అవి గొంతు కలిపి తీయని పాట పాడు
గూటిలోని పావురాలు మూడు
అవి గొంతు కలిపి తీయని పాట పాడు
మంచుతెరలు తొలగీపోయి పండువెన్నెల కాయునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment