Jan 2, 2012

చింతామణి

తారాగణం: రామారావు,ఎస్.వి.రంగారావు, భానుమతి, జమున
గాత్రం: భానుమతి
సంగీతం: అద్దేపల్లి రామారావు
నిర్మాత & దర్శకత్వం: రామకృష్ణ
సంస్థ: భరణి పిక్చర్స్
విడుదల: 1956



పల్లవి:

రావోయి రావోయి
రావోయి రావోయి ఓ మాధవా
రావోయి రావోయి ఓ మాధవా
అందాల రాధ అలిగిందీవేళ
రావోయి రావోయి ఓ మాధవా
అందాల రాణి అలిగిందీవేళ
రావోయి రావోయి ఓ మాధవా

చరణం1:

పొదరింటి నీడలలో పొంచింది రాధ ఆ ఆ ఆ
పొదరింటి నీడలలో పొంచింది రాధ
ఎదురుతెన్నులు చూచి విసిగింది రాధ
ఎదురుతెన్నులు చూచి విసిగింది రాధ
ఇంత జాగేల మురళిమోహన

వేగ రావోయి రావోయి ఓ మాధవా
అందాల రాణి అలిగిందీవేళ
రావోయి రావోయి ఓ మాధవా

చరణం2:

ఊదుమురా యమునావిహారీ నీ మురళి
ఊదుమురా యమునావిహారీ నీ మురళి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఊదుమురా యమునావిహారీ నీ మురళి
ఊగునురా నీ రాధ ఆనందడోల
ఊగునురా నీ రాధ ఆనందడోల
ఇంత జాగేల మురళిమోహన

వేగ రావోయి రావోయి ఓ మాధవా
అందాల రాణి అలిగిందీవేళ
రావోయి రావోయి ఓ మాధవా

చరణం3:

తన ప్రేమ వేణువులో దాచింది రాధ
తన ప్రేమ వేణువులో దాచింది రాధ
అనురాగ రాగసుధ అందించవేల
అనురాగ రాగసుధ అందించవేల
ఇంత జాగేల మురళిమోహన

వేగ రావోయి రావోయి ఓ మాధవా
రావోయి రావోయి ఓ మాధవా
అందాల రాణి అలిగిందీవేళ
రావోయి రావోయి ఓ మాధవా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment