Jan 6, 2012

అందగాడు

తారాగణం: కమల్‌హాసన్,శ్రీదేవి
గాత్రం: వాణిజయరాం
సంగీతం: ఇళయరాజా
నిర్మాత & దర్శకత్వం: టి.ఎం.బాలు
విడుదల: 1981



పల్లవి:

ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా
ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా
ఏ క్షణమెవరు ఏమౌతారో అంతా నీ లీల
ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా

చరణం1:

గూడే వదిలిన ఒంటరి చిలుక
తోడు నీడ కనలేక తిరిగే వేళ
మమతే ఎరుగని ఓ సిరిమల్లిక
గాలికి ఎగిరి గతిలేక నలిగే వేళ
పువ్వుల మాలను చేరెను నేడు చిత్రం చూడు
వింతేనోయి ఇంతేనోయి కాలం చేసే జాలం

ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా

చరణం2:

కాలం మనిషికి ప్రతికూలిస్తే
కర్రే పామై కాటేస్తే మారును కథలే
దైవంగానీ అనుకూలిస్తే
చేసిన పుణ్యం ఫలియిస్తే తీరును వ్యధలే
నిలుచునులేరా నీలో న్యాయం నీకు సహాయం
ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నీదేలేరా విజయం

ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా
ఏ క్షణమెవరు ఏమౌతారో అంతా నీ లీల
ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment