Jan 19, 2012

ఆంటీ



పల్లవి:

తళ తళ తళుకుల తారకలా
తహ తహ తలపుల కోరికలా
తలుపులు తెరిచిన తీపి కల
పిలిచే నను ఈవేళ
నా హృదయమున ఏదో రాగం సరిగములు పాడగా
నా హృదయమున ఏదో రాగం సరిగములు పాడగా
తళ తళ తళుకుల తారకలా
తహ తహ తలపుల కోరికలా
తలుపులు తెరిచిన తీపి కల
పిలిచే నను ఈవేళ

చరణం1:

ఊరించే ఊసులాడింది ఊహల్లో ఉండిపోకంది
అవకాశం అందుకొమ్మంది చక్కని చుక్క
ఊరించే ఊసులాడింది ఊహల్లో ఉండిపోకంది
అవకాశం అందుకొమ్మంది చక్కని చుక్క
నింగికి నిచ్చెన వెయ్యనా
నిగ నిగ నిధులను పొందనా
బంగరు కాంతుల కోటలో రారాజైపోనా
నింగికి నిచ్చెన వెయ్యనా
నిగ నిగ నిధులను పొందనా
బంగరు కాంతుల కోటలో రారాజైపోనా
కోటి కుళుకుల కొంటె పిలుపుల
కోటి కుళుకుల కొంటె పిలుపుల రాగం రమ్మనగా

తళ తళ తళుకుల తారకలా
తహ తహ తలపుల కోరికలా
తలుపులు తెరిచిన తీపి కల
పిలిచే నను ఈవేళ

చరణం2:

ఎండల్లో జల్లు కురిసింది గుండెల్లో మల్లె విచ్చింది
తీపంటే తెలిసి వచ్చింది ఆ స్నేహంతో
ఎండల్లో జల్లు కురిసింది గుండెల్లో మల్లె విచ్చింది
తీపంటే తెలిసి వచ్చింది ఆ స్నేహంతో
వెచ్చని ఊపిరి వేణువై విరిసెను బ్రతుకున నందనం
పచ్చని ఆశలు పల్లవై పాడే ఆనందం
వెచ్చని ఊపిరి వేణువై విరిసెను బ్రతుకున నందనం
పచ్చని ఆశలు పల్లవై పాడే ఆనందం
వెండి వెలుగులు పండు వెన్నెల
వెండి వెలుగులు పండు వెన్నెల నిండిన గుండెలలో

తళ తళ తళుకుల తారకలా
తహ తహ తలపుల కోరికలా
తలుపులు తెరిచిన తీపి కల
పిలిచే నను ఈవేళ
నా హృదయమున ఏదో రాగం సరిగములు పాడగా
నా హృదయమున ఏదో రాగం సరిగములు పాడగా
నా హృదయమున ఏదో రాగం సరిగములు పాడగా
నా హృదయమున ఏదో రాగం సరిగములు పాడగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: