Feb 16, 2012

మాస్టర్

తారాగణం: చిరంజీవి,సాక్షి శివానంద్,రోషిణి
గాత్రం: హరిహరన్, సుజాత
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: దేవా
దర్శకత్వం:సురేష్‌కృష్ణ
నిర్మాత:అల్లు అరవింద్
సంస్థ: గీతా ఆర్ట్స్
విడుదల: 1997



పల్లవి:

తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నాలెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది
తిలోత్తమా ప్రియ వయ్యారమా

చరణం1:

పెదవే ఓ మధుర కవిత చదివే
అడుగే నా గడపనొదిలి కదిలే
ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణీ ఇవ్వాలే మనకెవరు నేర్పారమ్మా
ఈ మాయ చేసింది ప్రేమే
ప్రియా ప్రేమంటే ఒకటైన మనమే
తిలోత్తమా శుభ వసంతమా

చరణం2:

కలలే నా ఎదుట నిలిచె నిజమై
వలపే నా ఒడికి దొరికె వరమై
ఏ రాహువైనా ఆషాఢమైనా ఈ బాహుబంధాన్ని విడదీయునా
నీ మాటలే వేదమంత్రం
చెలి నువ్వన్నదే నా ప్రపంచం

తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నాలెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment