Mar 19, 2012

భార్యాభర్తలు

గాత్రం: ఘంటసాల, పి.సుశీల
సాహిత్యం: శ్రీశ్రీ

పల్లవి:

ఓ సుకుమారా ననుజేర రావోయి ఇటు రావోయి
నిలువగలేని వలపులరాణి నీకొరకే తపించునులే
నిలువగలేని వలపులరాణి నీకొరకే తపించునులే
ఓ జవరాలా ప్రియురాలా ఈనాడే మనదే హాయి
తనువుగ నేడు నీ చెలికాడు నీ దరినే సుఖించునులే

చరణం1:

కోటి కిరణముల కోరినగాని భానుని చూడదు కలువ చెలి
కోటి కిరణముల కోరినగాని భానుని చూడదు కలువ చెలి
వెన్నెల కాంతి వెలిగిన వేళ
వెన్నెల కాంతి వెలిగిన వేళ
విరియునుగా విలాసముగా
నిలువగలేని వలపులరాణి నీకొరకే తపించునులే

చరణం2:

వేయి కనులతో వెదకినగాని తారకు జాబిలి దూరమెగా
వేయి కనులతో వెదకినగాని తారకు జాబిలి దూరమెగా
కలువల రాణి వలపులలోనె
కలువల రాణి వలపులలోనె
కళకళలాడి చేరునుగా
తనువుగ నేడు నీ చెలికాడు నీ దరినే సుఖించునులే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment