Mar 22, 2012

సింహరాశి

గాత్రం: ఉదిత్‌నారాయణన్, సుజాత
సాహిత్యం: పోతుల రవికిరణ్



పల్లవి:

సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా
సందమామ సందమామ సరసమాడయ్యా
నిన్ను చూసిన గడియనుండి నిదురలేదయ్యా
పుత్తడిబొమ్మే నీవా అందానికి అర్ధం నీవా
నచ్చినవాడివిలేరా నా ప్రాణమే నీవని తెలుసుకోరా
సత్యభామ....
సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా

చరణం1:

కట్టుకున్న పచ్చచీర బాగుందే చిలకమ్మ
ఒహో కట్టుకున్న పచ్చచీర బాగుందే చిలకమ్మ
ముట్టుకుంటే కట్టుజారి పోతుంది వినవయ్య
అరె వయ్యారి నారి వద్దంటే చేరి మీద మీదపడతావే
అహ అల్లేసుకోరా గిల్లేసుకోరా ఆకువక్క నీకేరా
కొంటె ఊపు సరి కొంగు సైగ మరి
ఈ అల్లరి హద్దులు దాటకె బుల్లెమ్మా

సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా

చరణం2:

పుట్టలోని పట్టుతేనె ఏమైందే ఓయమ్మ హే
అయ్యయయ్యో పుట్టలోని పట్టుతేనె ఏమైందే ఓయమ్మ
పట్టెమంచం కిర్రుమనగా ఒలికింది మావయ్యో
అరె కయ్యాలమారి కౌగిళ్ళుకోరి కాకమీద ఉన్నావే
అహ ముద్దెట్టుకోరా ముచ్చట్ట్లు తేరా పాలబుగ్గ నీదేరా
చక్కగుంది సిరి తప్పదమ్మ గురి కన్యరాశే కందులు కాసుకు బుల్లెమ్మా

సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా
సందమామ సందమామ సరసమాడయ్యా
నిన్ను చూసిన గడియనుండి నిదురలేదయ్యా
పుత్తడిబొమ్మే నీవా అందానికి అర్ధం నీవా
నచ్చినవాడివిలేరా నా ప్రాణమే నీవని తెలుసుకోరా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: