Mar 29, 2012

దేవిపుత్రుడు

గాత్రం: బాలు, చిత్ర
సాహిత్యం: జొన్నవిత్తుల



పల్లవి:

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ
సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే
నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే
ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ
సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే
నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే

చరణం1:

నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా
సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా
తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా
చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా
హరివిల్లే కాగా ఉయ్యాలలే
కోయిలలే పాడే నా జోలలే
బొమ్మలుగా మారే ఆ చుక్కలే
దిష్టంతా తీసే నలుదిక్కులే

చరణం2:

పాపలో అందమంతా బ్రహ్మకే అందనంత ఎంతో వింత
అమ్మలో ప్రేమ అంత నాన్నలో ఠీవి అంతా వచ్చేనంటా
తీయని నవ్వేమో దివి తారల వెలుగంత
కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత
అడుగేసి తీస్తే హంస జోడి
కులుకుల్లో తానే కూచిపూడి
చిరునవ్వులోన శ్రీరమణి
మారాము చేసే బాలామణి

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ
సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే
నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment