Apr 5, 2012

ఒక్కడు

తారాగణం: మహేష్‌బాబు,భూమిక,ప్రకాష్‌రాజ్
గాత్రం: ఉదిత్‌నారాయణన్,సుజాత
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
నిర్మాత: ఎం.ఎస్.రాజు
దర్శకత్వం: గుణశేఖర్
సంస్థ: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల: 2003



పల్లవి:

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడీ వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి

చరణం1:

ఆశా దీపికలై మెరిసే తారకలు
చూసే దీపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హొ అడుగే అలై పొంగుతుంది
ఓ ఓ ఓ చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ
రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపొతూ ఉంటే ఆపగలవ చీకట్లు
కురిసే సుగందాల హొళి ఓ చూపదా వసంతాల కేళి
కురిసే సుగందాల హొళి ఓ చూపదా వసంతాల కేళి

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి

చరణం2:

యమునా తీరాల కధ వినిపించేలా
రాధా మాధవులా జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళ ఓ చెవిలో సన్నాయి రాగంలా
కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల
రాతిరి ఏదని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లసంగా తుళ్ళి హొ చూపదా వసంతాల కేళి
ఊపిరే ఉల్లసంగా తుళ్ళి హొ చూపదా వసంతాల కేళి

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment