సాహిత్యం: ఆత్రేయ
గాత్రం: జేసుదాస్, శైలజ
పల్లవి:
ఓ బాటసారి ఇది జీవిత రహదారి
ఓ బాటసారి ఇది జీవిత రహదారి
ఎంతదూరమో ఏది అంతమో
ఎవరూ ఎరుగని దారి ఇది
ఒకరికి సొంతం కాదు ఇది
ఓ బాటసారి ఇది జీవిత రహదారి
చరణం1:
ఎవరు ఎవరికి తోడవుతారో
ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో
మనసే చాలని ఉంటారో
ఎవ్వరి పయనం ఎందాకో
అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ
అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ
చరణం2:
కడుపు తీపికి రుజువేముంది
అంతకు మించిన నిజమేముంది
కాయే చెట్టుకు బరువైతే
చెట్టును భూమి మోస్తుందా
ఇప్పుడు తప్పులు తెలుసుకునీ
జరిగేదే మిటనీ క్షమించదెవ్వరిని
చరణం3:
తెంచుకుంటివి అనుబంధాన్ని
పెంచుకున్నదొక హృదయం దాన్ని
అమ్మలిద్దరూ ఉంటారని
అనుకోలేని పసివాణ్ణి
బలవంతాన తెచ్చుకునీ
తల్లివి కాగలవా తనయుడు కాగలడా
చరణం4:
అడ్డదారిలో వచ్చావమ్మా
అనుకోకుండా కలిశావమ్మా
నెత్తురు పంచి ఇచ్చావు
నిప్పును నువ్వే మింగావు
ఆడదాని ఐశ్వర్యమేమిటో
ఇప్పుడు తెలిసింది కథ ముగిసేపోయింది
ఇప్పుడు తెలిసింది కథ ముగిసేపోయింది
ఓ బాటసారి ఇది జీవిత రహదారి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment