May 14, 2012

బాణం

గాత్రం: శంకర్ మహదేవన్



పల్లవి:

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా
ఆ కలల వెనకే అడుగు కదిపే ఆరాటం
ఏ క్షణము నిజమై కుదుట పడునో ఆవేశం
ప్రతి రోజు నీలో చిగురేసే ఆశే జతగా
నడిచేనా శ్వాసై నిను గమ్యం చేర్చే దిశగా
కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తియమనదా

చరణం1:

చెరగదే జ్ఞాపకమేదైనా పసితనం దాటిన ప్రాయాన
సమరమే స్వాగతమిచ్చేనా ఆ ఆ ఆ
కలగనే ఆశయమేదైనా బతుకులో ఆశలు రేపేనా
ఇపుడిలా నీ దరి చేరేనా ఆ ఆ ఆ
ఎదను తాకే గాయలు తాగే నేస్తాలు నీలో
ఎదురు చూసే కాలాలు పూసే చైత్రాలు నీ దారిలో

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా

చరణం2:

వెలుగయే వేకులలెన్నైనా వెతికితే లేవా నీలోన
జగతికే దారిని చూపేనా ఆ ఆ ఆ
గగనమే నీ తొలి మజిలీనా గమనమే ఓ క్షణమాగేనా
విజయమే నీడగ సాగేనా ఆ ఆ ఆ
అలలు రేపే సంద్రాలు దూకే సైన్యాలు నీలో
చెలిమి కోరే లోకాలు చేసే స్నేహాలు ఈ వేళలో

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment