తారాగణం: వెంకటేష్, సురేష్, సౌందర్య, అంజలాఝవేరి, ప్రేమ, బేబి చెర్రి
గాత్రం: బాలు, ప్రసన్న
సాహిత్యం: జొన్నవిత్తుల
సంగీతం: మణిశర్మ
నిర్మాత: ఎం.ఎస్.రాజు
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంస్థ: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల: 2001
పల్లవి:
ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా
ఓ ప్రేమ నుదిటి మీద కావమ్మా కుంకుమ
పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా
ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా
చరణం1:
అసలెందుకే ఆ అమృతమే
అనురాగముతో నువ్వు నవ్వితే
రతి సుందరిలా దరి చేరితే
చెలరేగిపోయే యవ్వనమే
మగ కోరికతో మాటాడితే
కొస చూపులతో తాకితే
మేను మేను ఆని తేలి సోలిపోనీ
ఏది ఏమి కానీ ఏకమవ్వనీ
రా మరి నా చెలి
ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా
చరణం2:
షెహనాయి మోగే కోవెలలో
శశికాంతులతో నను చేరుకో
గృహదేవతవై ఒడి చేర్చుకో
రతనాలు పండే నీ జతలో
సుఖశాంతులతో శృతి చేసుకో
ప్రియలాహిరిలో ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోనీ
కోటి జన్మలన్నీ తోడు ఉండనీ
రా మరి నా చెలి
ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా
ఓ ప్రేమ నుదిటి మీద కావమ్మా కుంకుమ
పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా
ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment