Feb 1, 2014

ప్రేమాభిషేకం

తారాగణం : అక్కినేని నాగేశ్వరరావు,శ్రీదేవి,జయసుధ
గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: దాసరి నారాయణరావు
సంగీతం : చక్రవర్తి
దర్శకత్వం: దాసరినారాయణరావు
సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల:1981



నాగేశ్వరరావుకి అశ్రునివాళి

పల్లవి:

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

చరణం1:

మరులు పూచిన పూల పందిరిలో
మమతల్లల్లిన ప్రేమ సుందరికి పట్టాభిషేకం..పట్టాభిషేకం
మనసు విరిచినా మమత మరువని
మధుర జీవిత మానవ మూర్తికి మంత్రాభిషేకం మంత్రాభిషేకం
రాగాల సిగలో అనురాగాల గుడిలో
భావాల బడిలో అనుభవాల ఒడిలో
వెలసిన రాగ దేవత రాగాభిషేకం
గెలిచిన ప్రేమ విజేత ప్రేమాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

చరణం2:

కలల చాటున పెళ్ళి పల్లకిలో
కదలి వచ్చిన పెళ్ళి కూతురికి పుష్పాభిషేకం పుష్పాభిషేకం
పాట మారినా పల్లవి మార్చని
ప్రణయ లోకపు ప్రేమ మూర్తికి స్వర్ణాభిషేకం స్వర్ణాభిషేకం
స్వప్నాల నింగిలో స్వర్గాల బాటలో
బంగారు తోటలో రతనాల కొమ్మకు
విరిసిన స్వప్న సుందరి క్షీరాభిషేకం
కొలిచిన ప్రేమ పూజారి అమృతాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 comment: