తారాగణం:సుమన్,లిజి,డబ్బింగ్ జానకి
గాత్రం:బాలు,పి.సుశీల
సాహిత్యం :సి.నారాయణరెడ్డి,జొన్నవిత్తుల
సంగీతం:జెవి.రాఘవులు
నిర్మాత:అర్.వి.విజయకుమార్
విడుదల:1990
పల్లవి:
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అర్దమున్నదా
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అర్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనె శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
అందరిని కనె శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అర్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనె శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
చరణం1:
రఘురాముడులాంటి కొడుకు వున్నా
తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
సుగుణరాసి సీత లాగ తాను
కోటి ఉగాదులే నా గడపకు తేవాలి
మెట్టెలతో నట్టింట్లొ తిరుగుతుంటే
మెట్టెలతో నట్టింట్లొ తిరుగుతుంటే
ఈ లోగిలి కోవెలగా మారాలి
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అర్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనె శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
చరణం2:
తప్పటడుగులేసిన చిననాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు
తప్పుటడుగులేస్తే ఈనాడు నన్ను నిప్పులో నడిపించు ఏ నాడు
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
అయినా నీ ముంగిట అదే అదే పసివాడినే
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అర్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనె శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
1 comment:
another good song from this movie (i dont remember first charanam fully)
కధ చెప్పే కధకుడ్ని కాదు
వ్యధ విప్పే పిరికోడ్ని కాదు
కాలిన మనసుతో కదిలే మనిషిని
కాలం గుప్పిట కరిగే నిజాన్ని
నా మధనం అర్ధం చేసుకో
నీ మనసు కలంతో రాసుకో
చీకటితోనే నా స్నేహం
సిరులపైనే నా హస్తం
గీసిన గీతే విధి వలయం
పలికిన మాటే ప్రచండ వేదం
మహారాజునా..కాదు కాదు
మాహత్ముడినా..కానే కాదు
లోకం నాడిని పట్టిన వాడ్ని
కాలనికి గురి పెట్టిన వాడ్ని
నా మధనం అర్ధం చేసుకో
నీ మనసు కలంతో రాసుకో
Post a Comment