Sep 17, 2007

దేవత

తారాగణం :రామారావు,సావిత్రి,నాగయ్య
గాత్రం: ఘంటసాల
సంగీతం: కోదండపాణి
నిర్మాత:పద్మనాభం
దర్శకత్వం:హేమంభరధరరావు
సంస్థ:రేఖ & మురళి ప్రొడక్సన్స్
విడుదల: 1965




పల్లవి:

ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి

చరణం1:

పతిదేవుని మురిపించే వలపుల వీణ
జీవితమే పండించే నవ్వుల వాన
కష్ట సుఖాలలో తోడు నీడగా
తల్లిని మరపించే ఇల్లాలి అదరణ
కష్ట సుఖాలలో తోడు నీడగా
తల్లిని మరపించే ఇల్లాలి అదరణ
మగువేగా మగవానికి మధుర భావన

ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి

చరణం2:

సేవలతో అత్త మామ సంతసించగా
పది మందిని ఆదరించు కల్పవల్లిగా
సేవలతో అత్త మామ సంతసించగా
పది మందిని ఆదరించు కల్పవల్లిగా
తనయుని వీరునిగ పెంచే తల్లిగ
సతియే గృహసీమను గాంచే దేవతగా
తనయుని వీరునిగ పెంచే తల్లిగ
సతియే గృహసీమను గాంచే దేవతగా
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా

ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి

||

No comments: