Oct 1, 2007

గృహలక్ష్మి

తారాగణం:నాగేశ్వరరావు,భానుమతి,పద్మనాభం
గాత్రం:భానుమతి
సంగీతం:సాలూరి రాజేశ్వరరావు
నిర్మాత:పి.ఎస్.రామక్రిష్ణారావు
దర్శకత్వం:భానుమతి,పి.ఎస్.రామక్రిష్ణారావు
సంస్థ:భరణి పిక్చర్స్
విడుదల:1967




పల్లవి:

మావారు శ్రీవారు మామంచివారు కలనైన క్షణమైన నను వీడ లేరు
నను వీడ లేరు
మావారు శ్రీవారు మామంచివారు కలనైన క్షణమైన నను వీడ లేరు
నను వీడ లేరు
మావారు శ్రీవారు మామంచివారు

చరణం1:

ఊహాతరంగాల ఉయ్యాల ఊగే
ఊహాతరంగాల ఉయ్యాల ఊగే ఊర్వశిని నేనే మేనకను నేనే
స్నేహానురాగాల సెలయేట తేలి
స్నేహానురాగాల సెలయేట తేలి శ్రీవారినలరించు దేవేరి నేనే

మావారు శ్రీవారు మామంచివారు

చరణం2:

ఆనంద లోకాల సయ్యాటలాడే
ఆనంద లోకాల సయ్యాటలాడే ప్రేయసిని నేనే శ్రీమతిని నేనే
మందార మకరంద మాధురుల కోరి
మందార మకరంద మాధురుల కోరి మన్సార దరిచేరు దొరగారు మీరే

మావారు శ్రీవారు మామంచివారు కలనైన క్షణమైన నను వీడ లేరు
నను వీడ లేరు
నను వీడ లేరు
మావారు శ్రీవారు మామంచివారు



||

1 comment:

Anonymous said...

MEE BLOG TODAY ONLY CHUSAANU. VERY GOOD AND NICE. FANTASTIC.
THANQ.