సంగీతం:సి.వి.సుబ్బరామన్
దర్శకత్వం:పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాతలు:భానుమతి,పి.ఎస్.రామకృష్ణారావు
సంస్థ:భరణి స్టుడియోస్
విడుదల:1949

పల్లవి:
విరితావుల లీల మనజాలిన చాలుగా నీవే నేనుగ
విరితావుల లీల మనజాలిన చాలుగా నీవే నేనుగ
జీవన రాజ్యమునేలే రాజువు నీవే, నా జీవన రాజ్యమునేలే రాజువు నీవే
జగజగాల్లో సొగసు నీవే నీపదసీమే నా కాపురమోయి
జగజగాల్లో సొగసు నీవే నీపదసీమే నా కాపురమోయి
విరితావుల లీల మనజాలిన చాలుగా నీవే నేనుగ
చరణం1:
నన్ను నామనసేలే మోహిని నీవేనే
నన్ను నామనసేలే మోహిని నీవేనే
నవజీవనవాహినివే వన్నెలవీణ నా వన్నెలవీణ
నవజీవనవాహినివే వన్నెలవీణ నా వన్నెలవీణ
విరితావుల లీల మనజాలిన చాలుగా నీవే నేనుగ
చరణం2:
ఈ సుఖలీల మనదే లేదిక ఎడబాటే
ఈ సుఖలీల మనదే లేదిక ఎడబాటే
జాబిలిలే నీచకోరే జీవము నిలచేనా
జాబిలిలే నీచకోరే జీవము నిలచేనా
నినువినాలిన మనజాలునా జీవము నీవే నా దైవము నీవే
నినువినాలిన మనజాలునా జీవము నీవే నా దైవము నీవే
విరితావుల లీల మనజాలిన చాలుగా నీవే నేనుగ
చరణం3:
మలగిపోని నా ప్రేమ
మలగిపోని నా ప్రేమ చెలియా మరగనే నిన్నే
మలగిపోని నా ప్రేమ చెలియా మరగనే నిన్నే
కలకాలమిదే సాటిలేని తనిమో నీ ప్రేమతో
కలకాలమిదే సాటిలేని తనిమో నీ ప్రేమతో
భూ జగమేలే మాయని గాధ ఈ తీయని బాధ
భూ జగమేలే మాయని గాధ ఈ తీయని బాధ
విరితావుల లీల మనజాలిన చాలుగా నీవే నేనుగ
|
No comments:
Post a Comment