Sep 21, 2007

అప్పుచేసి పప్పుకూడు

గాత్రం:ఘంటసాల,ఎ.ఎం.రాజ,పి.లీల

సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా
సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా

చరణం1:

అందము,ప్రాయము,ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
అందము,ప్రాయము,ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
ముందుగ ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవుకద

సుందరాంగులను చూసిన వేళల కొందరు పిచ్చనుపడనేలా
కొందరు ముచ్చటపడనేలా

చరణం2:

హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద
హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద
మందహాసమున మనసును తెలిపే ఇందువదన కనువిందుకదా

ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు పరవశ పడనేల
కొందరు కలవరపడనేల

చరణం3:

యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
ప్రేమపందెమును గెలిచేవరకు నామది కలవరపడునుకదా

ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు కలవరపడనేల
కొందరు పరవశ పడనేల

చరణం4:

కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద
కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద
వరములొసంగే ప్రేమదేవి గన పరవశమే మది కలుగుకదా

సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా

||

No comments: