సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం:ఎ.మోహన్ గాంధి
నిర్మాత:రవికిషోర్
సంస్థ:స్రవంతి మూవీస్
విడుదల:1988
పల్లవి:
ఆ ఆ ఆఅ
ఆ ఆ ఆఅ
నీ అందం నా ప్రేమగీత గోవిందం
నీ వర్ణం నా కీరవాణి సంకేతం
నీ రాగం ఏ ప్రేమవీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగారదీపం వెలిగిస్తే
నీ చూపు కోణం సందించు భాణం నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమగీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
చరణం1:
జీరాడు కుచ్చిళ్ల పారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా
కోరాడు మీసాల తారాడు మోసాల నా మందహాసాలు చమకించగా
ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎద జంట తాళాలు వినిపించగా
ఆషాడమేఘాల ఆవేశగీతాలు సరికొత్త భావాలు సవరించగా
నీకోసమే ఈడునేను వేచాములే
నీకోసమే నాలో నన్నే దాచానులే
నిను పిలిచాను మలిసందె పేరంటం ఇక మొదలాయే పొదరింటి పోరాటం ఆరాటం
నీ అందం నా ప్రేమగీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
చరణం2:
హంసల్లే వచ్చింది హింసల్లే గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా
మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్న నీ మాట వలపించగా
రెప్పల్లోకొచ్చింది రేపల్లే కాళింది నా నువ్వు నీ నేను క్రీడించగా
గాధల్లోఎ నిదరోయి రాధమ్మ లేచింది నా వేణువే నాకు వినిపించగా
నీ ఫించమే కిలకించితాలు చేసిందిలే
నాకోసమే ఈ పారిజాతం పూసిందిలే
మన హృదయాలలో ప్రేమతారంగం
స్వరబృందావిహారాల చిందేటి ఆనందం
నీ రాగం ఏ ప్రేమవీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సం యోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం శ్రుంగారదీపం వెలిగిస్తే
నీ చూపు కోణం సందించు భాణం నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమగీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
|
1 comment:
విహారి గారు, మీ ప్రయత్నం చాలా హర్షించదగింది.. మంచి మంచి పాటలన్నింటినీ, ఒక దగ్గర చేరుస్తున్నారు..
ఇంకా శ్రుతిలయలు, సాగరసంగమం, రుద్రవీణ, స్వర్ణకమలం, స్వాతికిరణం సినిమాలలోని పాటలన్నీ బావుంటాయి.. వీలుంటే వాటిని కూడా మీ సేకరణకి జత చేయగలరు..
అలానే, మాయాబజార్(క్రొత్తది)లో, సరోజ దళ నేత్రి అని ఒక పాట ఉంది.. దాన్ని కూడా.. ఇంకా ఇందాక మర్చిపోయాను.. శుభలేఖ సినిమాలో పాటలు కూడా...
మరీ లిస్ట్ ఎక్కువైనట్లుంది.. ఈ రోజుకు ఇవి చాలు.. :)
Post a Comment