సంగీతం:కీరవాణి
పల్లవి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేకపోతున్నా కమ్మని నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానే
స్వర్గం దిగివచ్చిందని
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేకపోతున్నా కమ్మని నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానే
స్వర్గం దిగివచ్చిందని
చరణం1:
ఒకేసారి కలలన్ని వెలేసాయి కన్నుల్ని
అమావాస్య కొలువై మోయమంటు రేయిని
సుదూరాల తారల్ని సుధాశాంతి కాంతుల్ని
వలలు వేసి తెచ్చా కంటికొనలో నింపని
చెదరని చెలిమికి సాక్షమా..
హ్రుదయము తెలుపగ సాధ్యమా..
మాయని మమతలదీపమా...
ఉదయపు తలుకులు చూపుమా..
నా జాబిలి నీవేనని
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
లలల లాల్లలా
లలల లాల్లలా
లలల లాల్లలా
లలల లాల్లలా
చరణం2:
తుదేలేని కధకాని గతం కాని స్వప్నాన్ని
ఇదే కౌగిలింతై కాలమంతా వుండని
నువే వున్న కన్నులతో అదే వంక చూడనని
రెప్ప వెనుక నిన్ను ఎల్లకాలం దాచని
యుగములు కలిగిన కాలమా ఈ ఒక గడియను వదులుమా
చరితలు కలిగిన లోకమా ఈ జత జోలికి రాకుమా
స్వప్నం చిగురించిందని
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేకపోతున్నా కమ్మని నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానే
స్వర్గం దిగివచ్చిందని
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఇంకొక్కసారి ఇంకొక్కసారి
|
1 comment:
విహారి గారూ,
నిజంగా చాలా మంచి పాట.ఈ పాట సాహిత్యం అందించినందుకు ధన్యవాదాలు. ఇదే సినిమాలో ఇంకొక మంచి పాట ఉందండి.అది జోలపాట."దాయి దాయి దమ్మని" అని వస్తుంది ఆ పాటలో. "ఊరుకో ఊరుకో బంగారు కొండా" అనుకుంటా.ఈ పాటల కొసం నెట్ లో వెతికా,ఎక్కడా దొరకలేదు.
మీకు వినాయకచవితి శుభాకాంక్షలు.
భాను
Post a Comment