సాహిత్యం : పింగళి నాగేశ్వరరావు
గాత్రం : ఘంటసాల,పి.సుశీల
పల్లవి:
ఉహుహు ఉహుహు ఉ ఉ ఉ ఉ ఉ
ఎంత హాయి...
ఎంత హాయి యీ రేయి ఎంత మధురమీ హాయి
ఆఆఆ ...
ఎంత హాయి యీ రేయి ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా...
ఆ చందమామ చల్లగా పన్నీటిజల్లు చల్లగా
ఎంత హాయి...
ఎంత హాయి యీ రేయి ఎంత మధురమీ హాయి
ఎంత హాయి...
చరణం1:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఒకరి చూపులొకరి పైన విరితూపులు విసరగా
ఆ ఆ ఆ ఆ
ఒకరి చూపులొకరి పైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయింపగా
ఆ విరితావుల ఘుమఘుమలో మేను పరవశింపగా
ఎంత హాయి...
ఎంత హాయి యీ రేయి ఎంత మధురమీ హాయి
ఎంత హాయి...
చరణం2:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కానరాని కోయిలలు మనకు జోలపాడగా కు కు కు
కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా
మధురభావలాహిరిలో మనము తూలిపోవగా
ఆ మధురభావలహరిలో మనము తేలిపోవగా
ఎంత హాయి...
ఎంత హాయి యీ రేయి ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా
ఎంత హాయి... ఈ రేయి...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3 comments:
పింగళి.
పింగలి కాదు.
చక్రపాని కాదు.
చక్రపాణి.
క్షమించండి.
మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
ఇవాళ ఈనాడులో మీ గీతాలు బ్లాగు గురించి వచ్చినందుకు అభినందనలు.
-- విహారి
http://blog.vihaari.net
Post a Comment