Sep 16, 2007

సప్తపది

తారాగణం :సోమయాజులు,రవి,సబిత
సంగీతం:కెవి.మహదేవన్
దర్శకత్వం :కె.విశ్వనాథ్



పల్లవి:

నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయవేళ
చూడలి నా నాట్య లీలా
నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయవేళ
చూడలి నా నాట్య లీలా
నెమలికి నేర్పిన
ఆఅ ఆ
నెమలికి నేర్పిన నడకలివి

చరణం1:

కలహంసలకిచ్చిన పదగతులు
యెల కోయిల మెచ్చిన స్వర జతులు
కలహంసలకిచ్చిన పదగతులు
యెల కోయిల మెచ్చిన స్వర జతులు
యెనెన్నో వన్నెల వెన్నెలలు
యేవెవో కన్నుల కిన్నెరలు
యెనెన్నో వన్నెల వెన్నెలలు
యేవెవో కన్నుల కిన్నెరలు
కలిసి మెలిసి కలలు విరిసి మెరిసిన
కాళిదాసు కమనీయ కల్పన
వల్ప శిల్పమని నే కలను శకుంతలను

నెమలికి నేర్పిన నడకలివి

చరణం2:

చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు
చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు
నీలాల కన్నుల్లో తారకలు
తారాడె చూపుల్లో చంద్రికలు
నీలాల కన్నుల్లో తారకలు
తారాడె చూపుల్లో చంద్రికలు
కురులు విరిసి మరులు కురిసి మురిసిన
రవి వర్మ చిత్ర లేఖన
లేఖ సరస సౌందర్య రేఖను శశి రేఖను

నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయవేళ
చూడలి నా నాట్య లీలా
నెమలికి నేర్పిన నడకలివి

||

No comments: