Sep 14, 2007

మట్టిలో మాణిక్యం

తారాగణం : భానుమతి,చలం,జమున,ధూళిపాళ
సంగీతం : సత్యం
నిర్మాత : చలం
దర్శకత్వం : బివి.ప్రసాద్
సంస్థ : రమణచిత్ర
విడుదల : 1971



పల్లవి:

శరణం నీ దివ్యచరణం
నీ నామమెంతో మధురం...
శరణం నీ దివ్యచరణం నీ నామమెంతో మధురం...
శ్రీశేషశైలవాసా ఆఆఆఆ...
శరణం నీ దివ్యచరణం నీ నామమెంతో మధురం...
శ్రీశేషశైలవాసా ఆఆఆఆ...
శరణం నీ దివ్యచరణం శ్రీచరణం.

చరణం1:

భక్తులబ్రోచే స్వామివి నీవే పేదల పాలిటి పెన్నిధి నీవే...
భక్తులబ్రోచే స్వామివి నీవే పేదల పాలిటి పెన్నిధి నీవే
సకల జీవులను చల్లగ చూచే...
సకల జీవులను చల్లగ చూచే కరుణామయుడవు నీవే.

శరణం నీ దివ్యచరణం నీ నామమెంతో మధురం...
శ్రీశేషశైలవాసా ఆఆఆఆ...
శరణం నీ దివ్యచరణం శ్రీచరణం.

చరణం2:

త్రేతాయుగమున శ్రీరాముడవై
ద్వాపరమందున గోపాలుడవై
త్రేతాయుగమున శ్రీరాముడవై ద్వాపరమందున గోపాలుడవై
ఈ యుగమందున వేంకటపతివై ఆఆఆఆఆ ఆఆ
ఈ యుగమందున వేంకటపతివై భువిపై వెలిసితివి నీవే.

శరణం నీ దివ్యచరణం శ్రీచరణం...

చరణం3:

నీ ఆలయమే శాంతికి నిలయం
నిను సేవించే బ్రతుకే ధన్యం
నీ ఆలయమే శాంతికి నిలయం నిను సేవించే బ్రతుకే ధన్యం
తిరుమలవాసా శ్రీవేంకటేశా...
తిరుమలవాసా శ్రీవేంకటేశా మా ఇలవేలుపు నీవే.


శరణం నీ దివ్యచరణం నీ నామమెంతో మధురం...
శ్రీశేషశైలవాసా ఆఆఆఆ...
శరణం నీ దివ్యచరణం శ్రీచరణం


||

No comments: