Sep 21, 2007

నిరీక్షణ

తారాగణం:భానుచందర్,అర్చన
గాత్రం:ఎస్.జానకి
సాహిత్యం:రాజశ్రీ
సంగీతం:ఇళయరాజా


పల్లవి:

లలలా లలలా లలలాల లలలాల
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది

చరణం1:

లలలలాల లలలలా లల
ఏ పువ్వు ఏ తెటిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దొ రాసున్నది
బంధాలై పెన వేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవుల
మధువులనే చవి చుడమనగ
పరువాలే ఏ ప్రణయాలై
స్వప్నాలే ఏ స్వర్గాలై
ఏన్నేన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది

చరణం2:

ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే ఏ దాహాలై
సరసాలే ఏ సరదాలై
కాలాన్నే నిలదీసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
లాలలలల లాలలల లలలల లలల లాలలలల

||

1 comment:

Anonymous said...

subhodayam !
Nireekshana lo pata cherchinanduku dhanyavaadalu.