తారాగణం :ప్రభాస్,అన్షు,శ్వేత
గాత్రం :శ్రేయా ఘోషల్
సంగీతం :మణిశర్మ
నిర్నాత :శ్రీనివాసరాజు
దర్శకత్వం :సురేష్ కృష్ణ
సంస్థ :శ్రీ శ్రీ ఆర్ట్స్
విడుదల :2003
పల్లవి:
హే మంత్రాలయదీప శ్రీరాఘవేంద్ర గురునాథ ప్రభో పాహిమాం..
శ్రీరాఘవేంద్ర గురునాథ ||9 సార్లు||
నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓఓ
నమ్మని వారికి తాపత్రయమేగా
శ్రీగురు బోధలు అమృతమయమేగా ఓఓ
చల్లని చూపుల సూర్యోదయమేగా
గురునాథ రాఘవేంద్రా శ్రీకృష్ణ పారిజాత
హన్మంత శక్తిసాంద్ర హరినామ గానగీతా
నీ తుంగభధ్ర మా పాపాలే కడగంగ
తుంగాదళాల సేవ తులసీదళాల పూజ అందుకో
చరణం1:
నిరాశ మూగే వేళ మా దురాశ రేగే వేళ
నీ భజనే మా బ్రతుకై పోనీవా ఆఅ
పదాల వాలే వేళ నీ పదాలు పాడే వేళ నీ చరణం మా శరణం కానీవా
మనసు చల్లని హిమవంత భవము తీర్చరా భగవంత
మదిని దాచిన మహిమంతా మరల చూపుమా హనుమంత
నీ వీణ తీగలో యోగాలే పలుకంగా ఆ ఆ
తుంగాదళాల సేవ తులసీదళాల పూజ అందుకో
నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓఓ
నమ్మని వారికి తాపత్రయమేగా
చరణం2:
వినాశ కాలంలోన ధనాశపుడితే లోన నీ పిలుపే మా మరుపై పోతుంటే
వయస్సు పాడే వేళ వసంతమాడే వేళ నీ తలపే మా తలుపే మూస్తుంటే
వెలుగు చూపరా గురునాథ వెతలు తీర్చరా యతిరాజా
ఇహముబాపి నీ హితబోధ వరము చూపే నీ ప్రియగాథ
నీ నామగానమే ప్రాణాలై పలుకంగ
తుంగాదళాల సేవ తులసీదళాల పూజ అందుకో
పల్లవి:
నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓఓ
నమ్మని వారికి తాపత్రయమేగా
శ్రీగురు బోధలు అమృతమయమేగా ఓఓ
చల్లని చూపుల సూర్యోదయమేగా
గురునాథ రాఘవేంద్రా శ్రీకృష్ణ పారిజాత
హన్మంత శక్తిసాంద్ర హరినామ గానగీతా
నీ తుంగభధ్ర మా పాపాలే కడగంగ
తుంగాదళాల సేవ తులసీదళాల పూజ అందుకో
|
No comments:
Post a Comment