సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి
గాత్రం: ఏ.ఎం.రాజా, పి.సుశీల
నిర్మాతలు:చక్రపాణి,నాగిరెడ్డి
దర్శకత్వం:ఎల్.వి.ప్రసాద్
సంస్థ:విజయ పిక్చర్స్
విడుదల:1955

పల్లవి:
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే

ఎందుకే రాధ ఈ శునసూయలు అందములందరి ఆనందములే

చరణం1:
పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే

రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
చరణం2:
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
ఎందుకే రాధ ఈ శునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
గోవిందుడు అందరి వాడేలే
|
No comments:
Post a Comment