Oct 12, 2007

స్వాతికిరణం

గాత్రం: వాణిజయరాం,చిత్ర

పల్లవి:

శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి
ఈ నాకృతి నీవు భారతి
ఈ నాకృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి
శరణా గతి నీవు భారతి

చరణం2:

నీ పదము లొత్తిన పదము ఈ పదము నిత్యకైవల్య పదము
నీ కోలువు కోరిక తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలువు
కోరిన మిగిలిన కోరికేమి నినుకోనియాడు కృతులు పెన్నిధి తప్ప
చేరిన యిక చేరువున్న దేమి నీ శ్రీచరణ దివ్యసన్నిధి తప్ప

శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి

చరణం2:

శ్రీనాధ కవి నాద శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు నీకీర్తులే
శ్రీనాద కవి నాద శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు నీకీర్తులే
త్యాగయ్య గలసీమ రావిల్లిన ఆనంత రాగాలు నీమూర్తులే
నీ కరుణ నెలకున్న ప్రతి రచన జననీ భవతారక మంత్రాక్షరం

శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి

---------------------------------------------

పాట ఇక్కడ వినండి

---------------------------------------------

No comments: