సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం:కె.విశ్వనాథ్
నిర్మాత:ఏడిద నాగేశ్వరరావు
సంస్థ:పూర్ణోదయ మూవీ క్రియేషన్స్
విడుదల:1983

పల్లవి:
ఓం ఓం ఓం
ఓం నమ:శివాయ
ఓం నమ:శివాయ
చంద్ర కళాధర సహృదయ
చంద్ర కళాధర సహృదయ
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయ
ఓం నమ:శివాయ
ఓం నమ:శివాయ
చరణం1:
పంచ భూతములు ముఖ పంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
పంచ భూతములు ముఖ పంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతొ నడచిన
ఏడు అడుగులే స్వర సప్తకమై
సగమదనిస దదమగని సమగగగ ససస నిగ మగసనిదమగస
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా ఆ ఆ ఆ ఆ
నీ మౌనమే
దషొపనిషత్తులై ఇల వెలయా
ఓం ఓం
ఓం నమ:శివాయ
చరణం2:
త్రికాలములు నీ నేత్ర త్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్ర త్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజ ముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ
సంకల్పానికి రుగ్విజవరులై
అద్వైతమే నీ ఆది యోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస నీ గానమే
జంత్రగాత్రముల శృతి కలయా
ఓం ఓం
ఓం నమ:శివాయ
చంద్ర కళాధర సహృదయ
చంద్ర కళాధర సహృదయ
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment