పల్లవి:
ఏమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెళుతోందీ
ఏమౌతుందీ తన ప్రాణం విడిచి దేహం వెళుతోంది
కలలన్ని కరిగాక కనులేల అంటుందీ
ఇక వెన్నెలలేని పున్నమి మిగిలింది
ఏమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెళుతోందీ
ఏమౌతుందీ
చరణం1:
దిక్కులేని జీవం పిలుపు దిక్కులన్ని మోగింది
దిక్కుమారి పొయే వలపు మారు పలకలేకుంది
మనసు రాయి చేసుకున్న మమత ఘోష మానకుంది
కళ్ళ నీళ్ళు దాచుకున్న కలల బరువు తీరకుంది
మూగ ప్రేమ మోసబోయి మోడు బారిపొయింది
పాడుతున్న పాట మరిచి గొంతు పూడిపొయింది
శృతి తప్పింది ఈ ఈ ఈ
ఏమౌతుందీ తన ప్రాణం విడిచి దేహం వెళుతోంది
ఏమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెళుతోందీ
చరణం2:
పూవులెన్ని పూస్తువున్న ముళ్ళు నాకు దక్కింది
పూజచేయు కోరికున్న కొవెలేమొ కూలింది
దేవిలేని కోవెలుంది దీపమేమో ఆరుతోంది
చమురు పొయు చేయి ఉంది ప్రమిద దాని కందకుంది
నన్ను చుట్టి చీకటున్న నేను కాలిపోతున్నా
వెలుగులోకి వెళుతూవున్న నెను చీకటౌతున్నా
ఇది తుది అవునా ఆ ఆ ఆ
ఏమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెళుతోందీ
ఏమౌతుందీ తన ప్రాణం విడిచి దేహం వెళుతోంది
కలలన్ని కరిగాక కనులేల అంటుందీ
ఇక వెన్నెలలేని పున్నమి మిగిలింది
ఏమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెళుతోందీ
ఏమౌతుందీ
No comments:
Post a Comment