పల్లవి:
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల
దీనుల హీనుల పాపుల పతితుల ఉద్దరించగా యుగయుగాలలో ఓ ఓ ఓ
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
చరణం1:
త్రేతాయుగమున రాముడుగా ద్వాపరమందున కృష్ణుడిగా
త్రేతాయుగమున రాముడుగా ద్వాపరమందున కృష్ణుడిగా
కలిలో ఏసు,బుద్దుడు,అల్లా
కలిలో ఏసు,బుద్దుడు,అల్లా కరుణామూర్తులుగా ఆ ఆ
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
చరణం2:
సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై
సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై
శాంతిస్థాపన చేయుటకై
శాంతిస్థాపన చేయుటకై ధర్మం నిలుపుటకై
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల
దీనుల హీనుల పాపుల పతితుల ఉద్దరించగా యుగయుగాలలో ఓ ఓ ఓ
దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
|
No comments:
Post a Comment