Dec 9, 2007

సుఖదు:ఖాలు

తారాగణం:ఎస్వీ.రంగారావు,రామకృష్ణ,చంద్రమోహన్,వాణిశ్రీ
గాత్రం: సుశీల
సంగీతం:ఎస్ పి కోదండపాణి
సాహిత్యం:దేవులపల్లి కృష్ణశాస్త్రి
విడుదల:1968

పల్లవి:

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

చరణం1:

కసిరే ఏండలు కాల్చునని
ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఏండలు కాల్చునని
మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కొయిల ఎగిరింది
ఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది
నేలకు వొరిగింది
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

చరణం2:

మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం
వసి వాడని కుసుమ విలాసం
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

చరణం3:

ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం
ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో
మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

||

No comments: