పల్లవి:
వెన్నెల వేళలు పోయెనా,ఏమున్నది నాకిక బ్రతుకున
వెన్నెల వేళలు పోయెనా,ఏమున్నది నాకిక బ్రతుకున
అనురాగమెరుగలేని జగతిని జీవితమంతా చీకటిరేయెనా
సుఖమంతా పోయెనా
చరణం1:
కలిమిలేనిదానా,ఏ కులములేని దీనా
కలిమిలేనిదానా,ఏ కులములేని దీనా
అందరాని ఆ చందమామకై ఏ ఏ ఏ ఆ ఆ ఆ
అందరాని ఆ చందమామకై ఆశపడితినేల బేలనై
జీవితమంతా చీకటిరేయెనా సుఖమంతా పోయెనా
చరణం2:
ఏరి కోరకు ఈ వాకిట నిలబడి ఎదురు చూసివేచెనో
ఏరి కోరకు ఈ వాకిట నిలబడి ఎదురు చూసివేచెనో
ఏరి ఎవరు నను పాపాయని ఇక చెంతనిలచి పిలిచేరా
వెన్నెల వేళలు పోయెనా,ఏమున్నది నాకిక బ్రతుకున
ఆ ఆ ఆ ఆ ఆ
|
No comments:
Post a Comment