పల్లవి:
భలేఛాన్సులే
భలేఛాన్సులే,భలేఛాన్సులే
లలలాం లలలాం లక్కీఛాన్సులే భలేఛాన్సులే
ఇల్లరికంలో ఉన్న మజా
ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునిలే
చరణం1:
అత్తమామలకు ఒక్క కూతురౌ అదృష్టయోగం పడితే
అత్తమామలకు ఒక్క కూతురౌ అదృష్టయోగం పడితే
బావమరుదులే లేకుంటే ఇక అల్లుడుదేలే అధికారం
భలేఛాన్సులే
చరణం2:
గంజిపోసినా అమృతంలాగా కమ్మగ ఉందనుకుంటే
బహు కమ్మగ ఉందనుకుంటే
చీ ఛా,చీ ఛా అన్న చిరాకు పడక దులపరించుకు పోయేవాడికి భలేఛాన్సులే
ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునిలే
భలేఛాన్సులే
చరణం3:
జుట్టు పట్టుకొని బయటికీడ్చినా చూరు పట్టుకొని వేలాడి
జుట్టు పట్టుకొని బయటికీడ్చినా చూరు పట్టుకొని వేలాడి
దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలచేవాడికి భలేఛాన్సులే
భలేఛాన్సులే,భలేఛాన్సులే
లలలాం లలలాం లక్కీఛాన్సులే భలేఛాన్సులే
ఇల్లరికంలో ఉన్న మజా
ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునిలే
చరణం4:
అణిగిమణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది
అణిగిమణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది
మామ లోభియై కూడబెట్టితే మనకే కాదా దక్కేది
అది మనకే కాదా దక్కేది
ఇహ మనకే కాదా దక్కేది
అది మనకే,ఇహ మనకే
అది మనకే,మనకే,మనకే,మ మ మ మనకే
|
No comments:
Post a Comment