Aug 21, 2008

భక్తకన్నప్ప

గానం: రామకృష్ణ,సుశీల
సాహిత్యం: ఆరుద్ర



పల్లవి:

ఆకాశం దించాల నెలవంక తుంచాల సిగలో ఉంచాలా ఆ ఆ
చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలిగింతలు చాలు
ఆకాశం నా నడుము నెలవంక నా నుదురు సిగలో నువ్వేరా
ఆ ఆ ఆ ఆ

చరణం1:

పట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే తెస్తానే
మిన్నాగు మణినైన పుట్టలోంచి తీస్తానే తీస్తానే
ఆ ఆ ఆ పట్టుతేనె నీకన్న తియ్యంగా ఉంటుందా
మిన్నాగు మణికైనా నీవిలువ వస్తుందా
అంతేనా అంతేనా
అవును అంతేరా
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా

చరణం2:

సూరీడు ఎర్రదనం సింధూరం చేతానే చేతానే
కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే దిద్దేనే
ఆ ఆ ఆ నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు
అంతేనా అంతేనా
అవును అంతేరా
మెరిసేటి చుక్కల్ని సిగలోన చుట్టాల తలంబ్రాలు పొయ్యాల
గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా

No comments: