Sep 2, 2008

అన్నమయ్య

గాత్రం:మనో,చిత్ర



పల్లవి:

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
వలపే ఇటు దులిపే చెలి ఒయ్యారంగా
కధలే ఇక నడిపే కడు శౄంగారంగా
పెనుగొండ ఎద నిండ రగిలింది వెన్నెల హలా ఆ ఆ
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
ఆ ఆ రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా

చరణం1:

సాపమ సామగ సాగసనిపస సాపమ సామగ సపమ గమమ మపని పసనిస
నీపని నీ చాటు పని రసలీల లాడుకున్న రాజసాల పని
మా పని అందాల పని ఘన సాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆపని
రేపని మరిమాపని క్షణమాపని మాపని
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మని
మపని
ఆ పని ఎదో ఇపుడే తెలుపని వలపని

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
ఆ ఆ

చరణం2:

సససస సనిస సససస సనిస సససస సనిస
ఓ సఖి నాకేందుముఖి ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి
ఓ సఖ మదనుని జనక ఈ సందిట కుదరాలి మనకు సంధి ఇక
ఋతువునకొక రుచి మరిగిన మనసయ్యాటకి
మాటికి మొగమాటపు సగమాటలు ఏటికి
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మని
మపని
పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
ఆ ఆ రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: