సాహిత్యం:ధాశరథి

పల్లవి:
అహహహ ఎహెహెహె లాలలల లాలలల
అంతట నీ రూపం నన్నే చూడనీ
ఆశలు పండించే నిన్నే చేరనీ
నీకోసమే నా జీవితం నాకోసమే నీ జీవితం
అంతట నీరూపం నన్నే చూడనీ
ఆశలు పండించే నిన్నే చేరనీ
చరణం1:
నీవేలేని వేళ ఈ పూచే పూవులేల
వీచే గాలి వేసే ఈల ఇంకా ఏలనే
కోయిల పాటలతో పిలిచే నా చెలీ
ఆకుల గలగలలో నడిచే కోమలీ
అంతట నీ రూపం నన్నే చూడనీ
ఆశలు పండించే నిన్నే చేరనీ
చరణం2:
నాలో ఉన్న కలలు మరి నీలో ఉన్న కలలు
అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చెనే
తీయని తేనెలకై తిరిగే తుమ్మెద
నీ చిరునవ్వులకై వెతికే నా ఎద
అంతట నీ రూపం నన్నే చూడనీ
ఆశలు పండించే నిన్నే చేరనీ
అహహహ ఒహొహొ లాలలల అహహహ ఎహెహెహె ఒహొహొ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment