.jpg)
పల్లవి:
కరిగిపోయాను కర్పూరవీణలా,కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టుజారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందెవెన్నెల కలిసిపోయాక ఈ రెండు కన్నులా
చరణం1:
మనసు పడిన కధ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా
ఏ ఆశలో ఒకే ధ్యాసగా
ఏ ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే పండించుకో మరీ తపించగా
కరిగిపోయాను కర్పూరవీణలా కురిసిపోయింది ఓ సందెవెన్నెల
నా గుట్టుజారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
కరిగిపోయాను కర్పూరవీణలా కురిసిపోయింది ఓ సందెవెన్నెల
చరణం2:
అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా
జతలు కలిసి మనమొంటిగా ఏమైనా సరి గరిసా
ఏ కోరికో శృతే మించగా ఈ ప్రేమలో ఇలా ముంచగా
అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాను నీ వంశధారలా
నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా
నా గుట్టుజారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
కురిసిపోయింది ఓ సందెవెన్నెల
కలిసిపోయాను నీ వంశధారలా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment