పల్లవి:
మూసిన ముత్యాలకేలే మొరగలు ఉం ఉం ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
చరణం1:
కందులేని మొమునకేలే కస్తూరి
చిందు నీ కొప్పునకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే పైకమ్మని నీమేనికి
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
చరణం2:
ముద్దుముద్దు మాటలకేలే ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లే
ఒద్దిక కూటమికేలే ఊర్పులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్క్డడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment