Oct 23, 2008

అల్లూరి సీతారామరాజు



పల్లవి:

తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా
తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా
తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా

చరణం1:

ఒహొ దారుణ మారణకాండకు తల్లడిల్ల వద్దురా ఆ ఆ
నీతి లేని శాసనాలు నేటినుండి రద్దురా ఆ ఆ
దారుణ మారణకాండకు తల్లడిల్ల వద్దురా
నీతి లేని శాసనాలు నేటినుండి రద్దురా
నిదుర వద్దు బెదర వద్దు
నిదుర వద్దు బెదర వద్దు నింగి నీకు హద్దురా
నింగి నీకు హద్దురా
ఆ ఆ ఆ ఓ ఓ ఓ

చరణం2:

ఓ ఓ ఒహొ ఎవడువాడు ఎచటివాడు
ఎవడువాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు
ఇటు వచ్చిన తెల్లవాడు
కండబలం కొండబలం కబలించే దుండగీడు
కబలించే దుండగీడు
మానధనం ప్రాణధనం దొచుకొనే దొంగవాడు
దొచుకొనే దొంగవాడు
ఎవడువాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు
కఠిన శాస్తి చేయరా
కఠిన శాస్తి చేయరా
తరిమి తరిమి కొట్టరా
తరిమి తరిమి కొట్టరా

తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా
ఆ ఆ ఆ ఓ ఓ ఓ

చరణం3:

ఈ దేశం ఈ రాజ్యం
ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి
నాదే అని చాటించి
ప్రతి మనిషి తొడలు కొట్టి శృంకలాలు పగులగొట్టి
శృంకలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుపెట్టి తుది సమరం మొదలుపెట్టి
తుది సమరం మొదలుపెట్టి
సింహాలై గర్జించాలి
సింహాలై గర్జించాలి
సంహారం సాగించాలి
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

చరణం4:

ఓ ఓ ఓ స్వాతంత్రవీరుడా స్వరాజ్యభానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా
స్వాతంత్రవీరుడా స్వరాజ్యభానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా
అందుకో మా పూజలందుకో ఓ రాజా
అందుకో మా పూజలందుకో ఓ రాజా
అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా
ఓ ఓ ఓ తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడ
మా నిదురించిన పౌరషాగ్ని రగిలించినవాడా
తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడ
మా నిదురించిన పౌరషాగ్ని రగిలించినవాడ
త్యాగాలే వరిస్తాం కష్టాలే భరిస్తాం
త్యాగాలే వరిస్తాం కష్టాలే భరిస్తాం
నిత్యయముగ నిర్భయముగ నీవెంటనే నడుస్తాం
నిత్యయముగ నిర్భయముగ నీవెంటనే నడుస్తాం
నీవెంటనే నడుస్తాం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్క్డడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: