Oct 27, 2008

ఇల్లరికం

గాత్రం:ఘంటసాల,సుశీల




పల్లవి:

నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని భలేచిరాకా ఎందుకో తగని భలేచిరాకా ఆ ఆ
నేడు శ్రీవారికి మేమంటే పరాకా

చరణం 1:

మొదట మగవారు వేస్తారు వేషాలు
పెళ్ళికాగానే చేస్తారు మోసం
ఆడవాళ్ళంటే శాంత స్వరూపాలే
కోపతాపాలు రావండి పాపం
కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు
కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు

నేడు శ్రీమతికి మాతోటి వివాదం
తగువే భలే వినోదం ఎందుకో తగువే భలే వినోదం
నేడు శ్రీమతికి మాతోటి వివాదం

చరణం2:

వారి మనసైతే వస్తారు ఆడవారు
చేర రమ్మంటే రానేరారు
తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు
అలుక సరదా మీకు అదే వేడిక మాకు
అలుక సరదా మీకు అదే వేడిక మాకు
కడకు మురిపించి గెలిచేది మీరేలే
ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే భలే వినోదం ఆ ఆ నిజమే భలే వినోదం ఆ ఆ నిజమే భలే వినోదం ,నిజమే భలే వినోదం

||

No comments: