గాత్రం:బాలు
సంగీతం:సత్యం
సాహిత్యం:దాశరధి
దర్శకత్వం: బి.ఎస్.ఆంజనేయులు
సంస్థ: శ్రీగౌరి ఎంటర్‌ప్రైజెస్
విడుదల:1973

పల్లవి:
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నా మధిలో నీవై నిండిపోయెనే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
నీ రూపమె దివ్య దీపమై
నీ నవ్వులే నవ్య తారలై
నాకన్నుల వెన్నెల కాంతి నింపెనే
ఏ దివిలో విరిసిన పారిజాజమో
చరణం1:
పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియెలు ఘల్లు ఘల్లుమన రాజహంసల రావె
ఏ దివిలో విరిసిన పారిజాజమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
చరణం2:
నిదురమబ్బులను మెరుపు తీగవై కళలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
కావ్య కన్యవై రావె
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment