Sep 21, 2009

6 టీన్స్

తారాగణం: రోహిత్,సంతోష్ పవన్,రుతిక
గాత్రం: కుమార్ సాను
సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ
సంగీతం: ఘంటాడి కృష్ణ
దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
విడుదల: 2001




పల్లవి:

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే
హా నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే
ఓ ఓ ఓ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే
హా నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే
హొ కాశ్మీరులొ కనపడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే
హా దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే

చరణం1:

మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
నా మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే
మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే
నిను మేఘాల ఒక బొమ్మ గావించగా
నే మలిచాను హరివిల్లునే కుంచెగా
ఈ చిరుగాలితో చెప్పనా
నీ మదినిండ నేనుండగా

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే
ఓ ఓ ఓ నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే

చరణం2:

ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నా
ఆ ఆ ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా
కొంగుముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నా
నా కలలన్ని నీ కనులు చూడాలని
బతిమాలాను నీ కంటిలో పాపని
మన్నించేసి నా మనసుని
ప్రసాదించు నీ ప్రేమని

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే
ఓ ఓ ఓ నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే
హొ కాశ్మీరులొ కనపడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే
ఓ ఓ ఓ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: