Sep 5, 2009

అభిమానం

తారాగణం:అక్కినేని నాగేశ్వరరావు,సావిత్రి ,కృష్ణకుమారి
గాత్రం:జిక్కి,ఘంటసాల
సంగీతం: ఘంటసాల
దర్శకత్వం: సి.యస్.రావు
నిర్మాత:సుందర్‌లాల్ నహతా
సంస్థ: శ్రీ ప్రొడక్షన్స్
విడుదల:1960




పల్లవి:

ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహొ బస్తీ దొరసాని

చరణం1:

ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది
హాయ్ ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది
హాయ్ ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది
అందచందాల వన్నెలాడి అయినా బాగుంది

ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహొ బస్తీ దొరసాని

చరణం2:

కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది
మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది
హాయ్ కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది
మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది
హాయ్ ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది
అందచందాల వన్నెలాడి కోపం పోయింది

ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహొ బస్తీ దొరసాని

చరణం3:

పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది
హాయ్ పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది
పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది
హాయ్ చివరకు చిలిపిగ నవ్వింది, చేయి చేయి కలిపింది
అందచందాల వన్నెలాడి ఆడి పాడింది


ఓహొ బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది
అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది
ఓహొ బస్తీ దొరసాని
ఓహొ బస్తీ దొరసాని
ఓహొ బస్తీ దొరసాని

||

No comments: