Sep 7, 2009

ముద్దుల మావయ్య

తారాగణం: బాలకృష్ణ, విజయశాంతి, సీత
గాత్రం: బాలు,సుశీల,శైలజ
సంగీతం: కె.వి.మహదేవన్
దర్శకత్వం : కోడి రామకృష్ణ
నిర్మాత: యస్.గోపాలరెడ్డి
సంస్థ: భార్గవ్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల: 1989



పల్లవి:

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటిపాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

చరణం1:

అరచేత పెంచాను చెల్లిని
ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవా
నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా
అమ్మగా లాలించాడు నిన్ను నాన్నగా పాలించాడు
అన్నగా ప్రేమించాడు అన్ని తానైనాడు
తన ప్రాణంగా నను పెంచాడు
ఆ దైవంగా దీవించాడు
నా అన్నలాంటి అన్న ఈ లోకాన లేడు

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

చరణం2:

ఆరేడు మాసాలు నిండగా
ఈ అన్నయ్య కలలన్ని పండగా
తేవాలి బంగారు ఊయల
కావాలి మా ఇల్లు కోవెల
రెప్పగా నిను కాచనా
పాపగా నిను చూడనా
రేపటి ఆశ తీరగా ఈ పాపకు జోల పాడనా
ఇది అరుదైన ఓ అన్న కథ
ఇది మురిపాల ఓ చెల్లి కథ
ఇది చెల్లెలే కాదులే నను కన్నతల్లి

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటిపాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: