Oct 17, 2009

అమ్మలేని పుట్టిల్లు

తారాగణం: శశికుమార్,ఊహ,చంద్రమోహన్,సుధ
గాత్రం: మనో,చిత్ర
సాహిత్యం: సాహితి
సంగీతం: చంద్రమోహన్
దర్శకత్వం: సాయిప్రకాష్
నిర్మాత: కె.మహేంద్ర
సంస్థ: ఎ.ఎ.ఆర్ట్స్
విడుదల: 1995




పల్లవి:

సాయిబాబా సాయిబాబా
మా ఇల్లే మురిపాల బంగరు లోగిలిలే
దేవతలే కొలువుండే మమతల కోవెలలే
ఆ గుడి దీప కాంతులే మా ఒడి చేరు పిల్లలే
మా ముంగిట తోరణమల్లే నిత్యం వెలుగును సంతోషాలే
మా ఇల్లే మురిపాల బంగరు లోగిలిలే
దేవతలే కొలువుండే మమతల కోవెలలే

చరణం1:

మా పందిరి మల్లెతీగలే మాకే పొదరిల్లే అల్లెలే
ఆ తీగకు పిల్లలమంటూ మా పిల్లల కిలకిల వింటూ
ఆ తెల్లని మల్లెల పువ్వులు నవ్వులు రువ్వే
ఈ పచ్చని పంటచేలల్లే చలచల్లని పైరగాలల్లే
కాపురమే కలలేచెందే మా కమ్మని కలలే పండే
మా కన్నుల వన్నెల చిన్నెల వెన్నెల కాసే
అమ్మే ఉంటే లోటేమంట
నాన్నే ఉంటే ఆటాపాటా
మా పిల్లల అల్లరి చూసి మేము పిల్లలమయ్యేమంట

మా ఇల్లే మురిపాల బంగరు లోగిలిలే
దేవతలే కొలువుండే మమతల కోవెలలే

చరణం2:

ఈనాడు ఉన్న ప్రేమలే ఏ ఏ ఏ ఏ
ఏనాడు మారిపోవులే ఏ ఏ ఏ ఏ
హృదయాల ఆనందాలు విడిపోని అనుబంధాలు
మదిలోని మమకారాలు జీవించెలే
ఈ కన్ను కలతచెందగా ఆ ఆ ఆ
ఆ కన్ను వగచినట్టుగా ఆ ఆ ఆ
ఏ ఒక్కరి కష్టానైనా ఒక్కటిగా ఏనాడైనా
అందరము కలసిమెలసి పంచుకోమా
అమ్మంటేనే అమ్మొక్కటే
మురిసేమమ్మ నీ ముద్దుకే
ఈ కళ్ళే ఉన్నన్నాళ్ళు రానీదమ్మ ఏ కన్నీళ్ళు

మా ఇల్లే మురిపాల బంగరు లోగిలిలే
దేవతలే కొలువుండే మమతల కోవెలలే
ఆ గుడి దీప కాంతులే మా ఒడి చేరు పిల్లలే
మా ముంగిట తోరణమల్లే నిత్యం వెలుగును సంతోషాలే
మా ఇల్లే మురిపాల బంగరు లోగిలిలే
దేవతలే కొలువుండే మమతల కోవెలలే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: